Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం అశోక్
- కుటుంబ సభ్యులతో కలిసి నిరసన
నవతెలంగాణ-తొర్రూరు
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కేంద్రంలోని తన నివాసంలో కుటుంబీకులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ గురువారం ఆయన నిరసన తెలిపి మాట్లాడారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన తెలుపుతున్నట్టు తెలిపారు. కరోనా బారిన పడిన పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక, ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఖర్చు భరించలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ వందలాది మంది మృతి చెందుతున్నా ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా మీన మేషాల్లెకించడం దుర్మార్గ మన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కరోనాకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం ఉచితంగా అందేలా చూడాలని కోరారు. నిరసనలో అశోక్ కుటుంబీకులు అనిల్, వీరమ్మ, మమత, కార్తీక్, రిత్విక, తదితరులు పాల్గొన్నారు.