Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంఎచ్ఓ డాక్టర్ మధుసూదన్,అడిషనల్ కలెక్టర్ సింగ్
నవతెలంగాణ-రాయపర్తి
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏకం పౌడేషన్ నిర్వాహకుల సహాయం ఎనలేనిదని వరంగల్ రూరల్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. సోమవారం ఏకం ఫౌండేషన్ నిర్వాహకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి రెండు లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలు అందించగా ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ, అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా దినదినం విజంభిస్తున్న తరుణంలో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆస్పత్రికి మరో డాక్టర్ను నియమిస్తున్నట్లు తెలిపారు.గ్రామస్థాయిలో విధులు నిర్వహించే ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఇంకా ఎలాటి సహాయం అందించాలన సిద్ధంగా ఉన్నామని ఏకం ఫౌండేషన్ నిర్వాహకులు శిల్ప తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ,ఎంపీడీఓ రాంమ్మోహన చారి, డాక్టర్ వెంకటేష్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి,జడ్పీటీసీ రంగు కుమార్, రైబస మండల అధ్యక్షుడు సురేందర్ రావు,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహా నాయక్, గ్రామ సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు రాధిక సుభాష్ రెడ్డి,అయిత రాంచందర్,నాయకులు పూస మధు, సుధాకర్, రాము,తదితరులు పాల్గొన్నారు.