Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
కరోనా నుంచి రక్షణ కోసం ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. సోమవారం ఆయన జీడబ్య్లూఎంసీ సిబ్బందితో కలిసి చిరువ్యాపారస్తులు టీకా వేసుకోవడం కోసం కూపన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లోని చిరు వ్యాపారులను అందరినీ గుర్తించి టీకా వేసుకోవడానికి కూపన్లు అందజేస్తామని తెలిపారు. కూపన్లు తీసుకున్న వారు శంభునిపేట్లోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో వారికీ కేటాయించిన తేదిలలో వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని చిరు వ్యాపారులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జవాన్ సారంగం తదితరులు పాల్గొన్నారు.