Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య
నవతెలంగాణ-తొర్రూరు
పారిశుధ్య కార్మికులే నిఖార్సైన సమాజ సేవకులని మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు కొనియాడారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం గ్లౌజ్‌లు, మాస్కులు, షూ, శానిటై జర్ బాటిల్లు, తదితరాలు అందించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య, బాబు మాట్లాడారు. కరోనా కట్టడిలో ప్రాణాలొడ్డి కార్మికులు సేవలు అందిస్తున్నారని తెలి పారు. విపత్కర పరిస్థితుల్లోనూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారంటూ ప్రశం సించారు. కరోనా వ్యాధి నుంచి కాపాడుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతు లను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రాము, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవేందర్, శేఖర్, జవాన్లు వెంకన్న, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.