Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు
నవతెలంగాణ-ధర్మసాగర్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఉపాధి హామీ కూలీల పని ప్రదేశాలను సందర్శించి, కార్మికుల పని వారికి అందిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పని చేసే ప్రదేశాలలో వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉపాధి కూలీలకు పనిముట్లు ప్రభుత్వమే అందించాల్సి ఉండగా అందించలేదని దీంతో కూలీలు ఈ కరోనా సమయం తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉపాధి కూలీలకు పనిముట్ల డబ్బులను అందించడంలో అలసత్వం వహించడం సిగ్గుచేటన్నారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పనిదినాలను కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి కూలీకి ఒక రోజుకు 600 రూపాయల కూలి చెల్లించాలని కోరారు. కరోనా ఈ పరిస్థితులలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు ప్రతి ఒక్కరికి మాస్కులు శానిటైజర్ మంచినీరు అందించాలన్నారు. కరోనాతో చనిపోయిన కూలీల కుటుంబాలకకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో మండల కేంద్రానికి చెందిన సురుగురు ఐలమ్మ కు తను చేసిన కూలితో పాటు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చిలుక రాఘవులు, జిల్లా నాయకులు బొల్లం సాంబరాజు, ఆరూరి భాగ్య, సదానందం, రజిత, వెంకటేష్, కోమల తదితరులు పాల్గొన్నారు.