Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర
నవతెలంగాణ-కాశిబుగ్గ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడు కలను 20వ డివిజన్ పరిధిలోని శాంతినగర్లో ఘనంగా నిర్వహించారు . కార్పొరేటర్ నరేంద్ర టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించగా పెండ్యాల కొము రయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ నరేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివద్ధి చెందుతూ బంగారు తెలంగాణ సాధన దిశగా పయనిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధూపం సంపత్, డివిజన్ అధ్య క్షుడు ఇక్బాల్, నాయకులు సారంగపాణి, మంద రమేష్, యూసఫ్, మొహ మ్మద్, గొర్రె ఆనంద్, బాలరాజు, పెండ్యాల సోనీ బాబు, జాన్సన్, తదితరులు పాల్గొన్నారు