Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కోవడ్19తో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు చేస్తున్నా పేషంట్ కేర్ సెక్యూరిటీ శానిటేషన్ సిబ్బంది సేవలు మరువలేనివని ప్రిన్సిపల్ జిల్లా సెషన్ న్యాయమూర్తి నందికొండ నర్సింగ్ రావు, వరంగల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెకటరీ సీనియర్ న్యాయమూర్తి జీవీ. మహేష్ నాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కరించుకుని ఎంజీఎం ఆస్పత్రిలో పొరుగు సేవ ఉద్యోగులకు బుధవారం ఆస్పత్రి ప్రాంగణంలో ఆహార ప్యాకెట్ల పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాన వత్వం మరిచి పోయి అయిన వాళ్లే కొవిడ్ బారిన పడిన వారిని దూరంగా పెడుతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని నెలలుగా ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తున్న పొరుగు సేవ ఉద్యో గుల చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ వీ.చంద్రశేఖర్ ఆర్ఎంఓ డాక్టర్ వెంక టరమణ, సానిటేషన్ పేషెంట్ కేర్ అండ్ సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.