Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ తిరుమల్
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
అమాయక రైతులకు కల్తీ విత్తనాలను విక్రయించినట్లు తేలితే విత్తన దుకాణ యజమాని జైలు పాలవ్వడం ఖాయమని డీఎస్పీ తిరుమల్ డీలర్లకు సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విత్తన డీలర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఏఓ సంపత్‌రెడ్డి అధ్యక్ష వహించగా డిఎస్పి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విత్తన డీలర్లు నకిలీ విత్తనాలను అత్యాశతో ప్రోత్సహించి విక్రయిస్తే విత్తన చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి చఠప్రకారం శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. మండలంలో డీలర్లు రైతులకు తెలిసేలా విత్తనాలను విక్రయించి ఆ విత్తనపై పూర్తిగా రైతు లకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి విత్తన వ్యాపారి దుకాణంలో స్టాకు వివరాలను బోర్డుపై నమోదు చేస్తూ ప్రతిరోజు అప్డేట్ చేయాలన్నారు. విక్ర య సమయంలో వ్యాపారులు విత్తన ప్యాకెట్‌పై ముగింపు తేది చూసు కోవాలని, రశీదు తప్పనసరిగా జారీ చేయాలన్నారు. అనుమతిలేని బిజి-1,2,3 విత్తనాలను విక్రయించరాదని, విక్రయిస్తే పోలీసులకు, వ్యవ సాయ అధికారులకు సమాచారం అందించాలన్నారు. రైతులు సైతం ప్రభు త్వ అమోదిత దుకాణాల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేపట్టాలన్నారు. అనంతరం డీలర్లకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. సమా వేశంలో ఎస్సై నాగరాజు, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షులు హరిప్రసాద్, పాల్గొన్నారు.