Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్
నవతెలంగాణ-తొర్రూరు
కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ తెలిపారు. డివిజన్ కేంద్రంలో ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ జెండా ఎగరేసి మాట్లాడారు. ప్రజాకాంక్షను గౌరవిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందని గుర్తు చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ అందుకు భిన్నంగా సీఎం పదవిని చేపట్టి మోసగించాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షుడు ధీకొండ శ్రీనివాస్, కౌన్సిలర్లు భూసాని రాము, తూనం రోజా, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు సంతోష్, బీసీ సెల్ జిల్లా నాయకుడు తాళ్లపల్లి భిక్షంగౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బచ్చలి లక్ష్మణ్, నాయకులు ప్రతికంఠం దేవేందర్ రాజు, పబ్బాల రాము, కర్ర అశోక్‌రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యం లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు గుగులోతు దస్రూనాయక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట వెంకన్న పాల్గొని మాట్లాడారు. తొలుత పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజాకాంక్షను గౌరవించి సోనియాగాంధీ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర నాయకుడు తండ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ బాలు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అయూబ్ ఖాన్, సారయ్య, సత్యానందం, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలునాయక్, పొలెపాక నాగరాజు, కళ్యాణ్, వెంకట్‌రెడ్డి, జల్లె ఏకాంబరం, వెంకన్న, పోకల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.