Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షానికి తడిసిన ధాన్యం
- ఆందోళన చెందుతున్న రైతులు
- ఒక్క జనగామ మార్కెట్ లోనే
- 5వేల బస్తాలకు పైగా తడిసిన ధాన్యం
నవతెలంగాణ-జనగామ
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటిపాలైంది. జనగామ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి 139.4మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా నర్మెట్ట మండలంలో 32.5 8 మిల్లీమీటర్లు, లింగాల ఘనపూర్లో 29.8 బచ్చన్నపేటలో 26.2, పాల కుర్తిలో 24.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలో 15వేల బస్తాలకు పైగా ధాన్యం తడిిచినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. ఇందులో కేవలం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 5వేలకు పైగా ధాన్యం బస్తాలు తడి చాయి. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతు న్నారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రానికి వచ్చి 15 రోజుల నుంచి 20 రోజులుగా పడిగాపులు కాచినా ధాన్యం లిఫ్టింగ్ చేయలేదని, దీంతో తమ ధాన్యం వర్షానికి తడిచి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది వారాలుగా జిల్లాలో లారీల కొరతతో ధాన్యం బస్తాల లిఫ్టింగ్ సమస్య నెకొంది. దీనిని అధిగమించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ముందస్తు వర్షాలు వస్తాయని అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ కళ్లాల్లో వేలకొద్ది ధాన్యం బస్తాలున్నా వాటిని లిఫ్ట్ చేయడం లో విఫలమైన పరిస్థితి. తడిసిన ధాన్యంను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర చెల్లించి కళ్లాల నుంచి ధాన్యాన్ని తరలించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి పోయింది. తడిసిన ప్రతి ధాన్యపు గింజకు గిట్టు బాటు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి. రైస్ మిల్లర్లు అక్రమంగా కొనుగోలు చేసిన ధాన్యం లో కోతలు విధిస్తూ రైతులకు మరింత నష్టం చేస్తున్నారు. ఈ దోపిడీ వ్యవస్థను అధికారులు అరికట్టాలి.
- మోకు కనకారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు