Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-జనగామ
ఎన్నో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టు కున్నామని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యా లయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. కలెక్టరేట్ వద్దే ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదా లను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నదని అన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు తదితర మౌలిక వసతులను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో పూర్తిచేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. సమైక్యాంధ్రలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైందని అన్నారు. నాడు తక్కువ మందితో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి లక్షలాది మందిని జాగతం చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, అమలుచేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. రైతాంగానికి సాగుకు పుష్కలంగా నీరు, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరిగినట్లు, దిగుబడి అంచనాలకు మించి వచ్చినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కనీస మద్దతు ధరకు గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతు పండించిన ప్రతి గింజను కొంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చి రైతుల వద్ద ధాన్యం కొంటున్నట్లు అన్నారు. 2020-21 యాసంగి పంటను జిల్లాలో 195 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, ఇప్పటికే లక్షా 63 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 27 వేల 797 మంది రైతుల ఖాతాల్లో రూ. 182.50 కోట్లు జమచేసామన్నారు. కోవిడ్ నియం త్రణ, చికిత్సకు జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలోని ప్రధాన ఆసుపత్రి, 15 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 2లక్షల7వేల360మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 15వేల883మందికి పాజి టివ్ రాగా, చికిత్స అనంతరం 14వేల91 మంది కొలుకోగా, 186 మంది ప్రాణాలు కోల్పోయార న్నారు. 1606 మంది చికిత్సలో ఉన్నారన్నారు. రెండు విడతలుగా ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించినట్లు, ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు కోవిడ్ ఓపి చేపట్టినట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న 13వేల715మందికి హౌమ్ మెడికల్ కిట్లు అందజేసి, ప్రతిరోజూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో కోవిడ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి, హౌం మెడికల్ కిట్లు ఇచ్చిన వారికి మెరుగైన సేవలందేలా పర్యవేక్షిస్తు న్నామని అన్నారు. జిల్లాలో 10 కోవిడ్ చికిత్స ఆసుపత్రులు ఉన్నాయని, ఐసులేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బెడ్లు, ఆక్సిజన్, మందుల, వైద్యులు, వైద్య సిబ్బంది కొరత జిల్లాలో లేదని తెలిపారు. జిల్లాలో 100 ఆక్సిజన్ జనరల్ బెడ్లు, ఐసీయూ బెడ్లు వెంటిలేటర్లతో 10, లేకుండా 22, సాధారణ బెడ్లు 140 అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. డి టైప్ ఆక్సిజన్ సిలండర్లు 63, బి టైప్ ఆక్సిజన్ సిలండర్లు 22 అందుబాటులో ఉన్నా యన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 74వేల208 డోసుల వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. సూపర్ స్ప్రెడర్స్ లుగా గుర్తించిన 1600పైచిలుకు జర్నలిస్టులు, రేషన్, ఫర్టిలైజర్, సీడ్, పెస్టిసైడ్, ఎల్పీజీ డీలర్లు, ఆయా షాపుల్లో పనిచేసే సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులకు మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. జిల్లాలో 2 వేల 67 మంది ప్రయివేటు టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బందిని గుర్తించి ఏప్రిల్, మే 2021 నెలల్లో 25 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా అందించామన్నారు. పీఎంజికెఎవై పధకం కింద జూన్, జులైలో ప్రతి రేషన్ కార్డుదారునికి 15 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుకు 35 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామన్నారు. 185 లక్షలతో ఇవీఎం, వీవీ ప్యాట్ స్టోరేజి భవన నిర్మాణం పూర్తైనట్టు తెలిపారు. రూ.58 కోట్ల అంచనాతో సమీకృత జిల్లా కార్యాలయ సము దాయాలు, జిల్లా అధికారులు నివాస భవనాలు వచ్చే జులైలో పూర్తవుతాయన్నారు. జెడ్పి చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె నిఖిల, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కష్ణారెడ్డి, డిసిపి శ్రీనివాస రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, ఏసీపీ వినోద్ కుమార్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.