Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
మండలంలోని పగిడిపల్లి గ్రామంలోని పలువురు కరోనా బాధితులకు వార్డు సభ్యురాలు గంధసిరి సింధూజ శ్రీపాల్, టీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్య క్షుడు దుండి మురళీ ఆధ్వర్యంలో బుధవారం బియ్యం, గుడ్లు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే పంచాయతీ సిబ్బందిని, ఆశావర్కర్లను, అంగ న్వాడీ టీచర్లను, ఆయాలను శాలువాలతో సత్కరించి సరుకులు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరయ్య, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రవీందర్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు వెంకన్న, గ్రామ రైతు కోఆర్డినేటర్ మంగ్యా నాయక్, గ్రామ కోఆప్షన్ సభ్యుడు వెంకటరెడ్డి, నాయకులు మంగీలాల్, వెంకటయ్య, రమేష్, పంచాయతీ కార్యదర్శి రోజా, తదితరులు పాల్గొన్నారు.
క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో..
కేసముద్రం రూరల్ : మండల క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అమీనాపురంలోని మహర్షి డిగ్రీ కళాశాలలో పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశీనాధ్ మాట్లాడారు. పాస్టర్లను ఆదుకునేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. అనంతరం సర్పంచ్ పురం రాజమణి రమేష్ మాట్లాడారు. కరోనా ఉధృతి నేపథ్యంలో కష్టాల్లో ఉన్న వారికి సమాజం, యువత అండగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం యూత్ అధ్యక్షుడు వెంకట్ మాట్లాడారు. ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమర్, మంద ప్రవీణ్, జన్ను కష్ణ, బిర్రు నవీన్, వేల్పుగొండ అనిల్, ఈసంపెల్లి డేవిడ్, తక్కళ్లపల్లి మహేందర్, నాగేల్లి దాసు, బీరు సంపత్, మేకల అశోక్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : కరోన నియంత్రణ చర్యల్లో భాగస్వాములౌతూ పంచాయతీలోని పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందిస్తున్న దాతల దాతృత్వం అభినందనీయమని సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ అన్నారు. కోవిడ్ వారియర్లుగా సేవలు అందిస్తున్న విశాల్ జైన్, వార్డు సభ్యుడు పల్లెపంగు నాగరాజు, టీమ్ సభ్యులు కలిసి ప్రీతి కాలా, ప్రతాప్ షా రజిని, రాహుల్ జైన్, వరుణ్ చిన్మణి, ముంజల వినరు సహకారంతో సేకరించిన నిధులతో పంచాయతీ సిబ్బందికి బుధవారం పంచాయతీ కార్యాలయంలో పండ్లు, పాలు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బన్సీలాల్ మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పారిశుధ్య పనులు చేపడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేశ్వర్రావు, కార్యదర్శి లక్ష్మణ్, వార్డు సభ్యుడు పందుల నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.