Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
రాబోయే రోజుల్లో దక్షిణ భారత ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూడబోతున్నామని కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటి కొండ రమేష్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాల పరిపాలన భవన ప్రాంగణంలో రిజిస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన 7వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జలమే జీవన ఆధారమని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టిన తెలంగాణ స్వాప్నికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విశ్వవిద్యాలయం ప్రస్తుత పరిస్థితిలో డిజిటల్ దిశగా పయనించాలని న్యాక్-2022 అక్రిడిషన్ కోసం ఇప్పటి నుంచే సన్నద్దం కావాలన్నారు. అందుకనుగుణంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయ ప్రతిష్టను ఇనుమడింపచేయడంలో ప్రతి ఒక్క ఉద్యోగి, పరిశోధక, విద్యార్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య పి.మల్లారెడ్డి, ఆచార్య రాజేశ్వర్, ఆచార్య టి.మనోహర్, డాక్టర్ సుమతి, ఉమామహేశ్వరి, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ మధన్‌కుమార్, బి.రాజిరెడ్డి, ప్రొఫెసర్లు వి.రామచంద్రం, టి.శ్రీనివాస్, జి.వెంకన్న, కె.రాజిరెడ్డి, డాక్టర్ బ్రహ్మేశ్వరి, డాక్టర్ ఎస్.జ్యోతి, డాక్టర్ పి.శ్రీనివాస్‌రావు, ప్రజాసంబందాల అధికారి వల్లాల పృథ్విరాజ్, వివిద విభాగాల అధికారులు, బోధనాబోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.