Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి గంగరాపు ఆనందరావు చిరస్మరణీ యులని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం రాత్రి కరోనా మహమ్మరితో పోరాడి హైదరాబాద్ విరించి హాస్పిటల్లో మృతిచెందారు. విషయం తెలుసుకున్న వారు శుక్రవారం మండల కేంద్రంలోని ఆనందరావు నివాసం వద్ద చేరుకొని ఆనందరావు పార్ధీవా దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన ఆనందరావు కుటుం బానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. అనంతరం తాటికొండ రాజయ్య మాట్లాడుతూ... కరోనా మహమ్మరికి బలికావడం విషాధకారమని తెలిపారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మండల రైతు బంధు సమితి కన్వీనర్ సోంపేల్లి కరుణాకర్, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు జుభేధాలాల్ మహమ్మద్, రావుల వెంకట్రెడ్డి, తాటికాయల చిరంజీవి, బొడ్డు సోమయ్య, గంగారపు అమృతరావు, ఫాథర్ మారేపల్లి ప్రవీణ్, సురేష్, ప్రసాద్ పాల్గొన్నారు.
జర్నలిస్ట్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ కొట్టే లెనిన్ సుధాకర్ తల్లి ప్రమీల(65) కరోనాతో ఈ నెల 2న బుధవారం మృతిచెందింది. కాగా స్థానిక ఎమ్మెల్యే రాజయ్య శుక్రవారం సుధాకర్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. వారి వెంట విలేకర్లు శ్రీనివాస్, విష్ణువర్ధన్ రాజు, బొడ్డు బాలు ఉన్నారు.