Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ రాజోలులో స్థల పరిశీలన
నవతెలంగాణ-కురవి
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కు సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మండ లంలోని రాజోలులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం సర్వే నెంబర్ 152, 407ల్లోని స్థలాన్ని రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి కలెక్టర్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 200 ఎకరాల విస్తీర్ణం కలిగిన స్థలాన్ని సేకరించనున్నట్టు తెలిపారు. సర్వే నెంబర్ 152 కు రోడ్ కనెక్టివిటీ, భారీ వాహనాల రాకపోకలకు, విద్యుత్, నీటి, రోడ్ల విస్తరణ, తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు. మున్నేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి కాలపరిమితి, సామర్ధ్యం, తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని రోడ్లు అండ్ బీ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గ్రామసభ ఏర్పాటు చేసి రైతులతో మాట్లాడాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కొమరయ్య, తహసీల్దార్ విజరు కుమార్, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల స్థాపన కార్పొరేషన్ జోనల్ మేనేజర్ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.