Authorization
Mon March 24, 2025 08:59:34 am
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రజాసమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వ్యకాస మండల అధ్యక్షుడు పెరుమాండ్ల తిలక్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఆధ్వ ర్యంలోని సంఘం బృందం తహసీల్దార్ రమేష్‌కు శుక్రవారం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా తిలక్ బాబు మాట్లాడారు. 18 నుంచి 45 ఏండ్ల వరకు వయస్కులైన అందరికీ ఉచితంగా వ్యాక్సీన్ ఇవ్వా లని, అన్ని గ్రామాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కరోనా బాధితు లకు ప్రభుత్వం పౌష్టికాహారం అందించాలని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయించడంతోపాటు మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక ప్రజలను, రైతులను, కార్మికులను పాలకులు విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిందని స్పష్టం చేశారు. ధాన్యం తడిచిన, కొట్టుకుపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాంటా వేయించి మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు అశోక్, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు గుగులోతు వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ కమిటీ అధ్యక్షుడు పొట్టమంచి యాకన్న, రైతు సంఘం నాయకుడు జాగిరి అనిల్, తదితరులు పాల్గొన్నారు.