Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబాలకు అన్నదానం, మాస్క్‌లు పంపిణీ
నవతెలంగాణ-ములుగు
ఎల్ఐసీి వరంగల్-1 బ్రాంచ్ పరిధిలోని ములుగు ఎల్ఐసీ శాటిలైట్ బ్రాంచ్ డెవలప్మెంట్ అధికారుల సేవలు అభినందనీయమని ఏఎప్పీ పోతురాజు సాయి చైతన్య తెలిపారు. ములుగు సాటిలైట్ బ్రాంచ్ డెవలప్మెంట్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం కరోనా బాధిత 100 కుటుంబాలకు ఏఎస్పీ చేతుల మీదుగా శుక్రవారం అన్నదానం, ఆక్సిజన్ మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో ఐదు రోజులుగా కరోనా బాధిత కుటుంబాలకు ఉచిత అన్నదానం, మాస్క్‌లను పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. అన్నదానం చేయడానికి ముందుకొచ్చిన అధికారులకు, వారిని ప్రోత్సహించిన వారికి, వైద్యాధికారులకు ఏఎస్పీ కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్ఐసీ డీఓలు విద్యాసాగర్, నారాయణరావు, జయకర్, రమణారెడ్డి, పూర్ణచందర్, దీపక్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
మీడియా ప్రతినిధులకు శానిటైజర్, మాస్కులు పంపిణీ
ములుగు పోలీస్‌స్టేషన్ ఆవరణలో స్థానిక మీడియా ప్రతినిధులకు ఏఎస్పీ సాయిచైతన్య శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కరోనా ఉధృతి నేపథ్యంలోనూ ప్రాణాలకు తెగించి వార్తలను ప్రజలకు అందించడంలో మీడియా ముందుందని చెప్పారు. కార్యక్రమానికి కారణమైన సీఐ ప్రొబేషనరీ ఎస్సై రాధిక, సిబ్బంది పాల్గొన్నారు.