Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం
పేదల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఐదుగురు లబ్దిదారులకు ఆయన శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం లో ప్రజాకర్షక పధకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
కేసముద్రం : మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారి తోట పుల్లయ్య ఇటీ వల అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబాన్ని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పరామర్శించారు. తొలుత పుల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ల ర్పించారు. అనంతరం అమీనాపురం గ్రామానికి చెంది టీఆర్ఎస్ నాయకుడు సతీష్ ఇటీవల కరోనాతో మతి చెందగా అతడి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామ ర్శించి రూ.5 వేలు సాయం అందించారు. అలాగే ఇనుగుర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సట్ల భిక్షం మృతి చెందగా అతడి మృతదేహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జెడ్పీటీసీ శ్రీనాథ్‌రెడ్డి, నజీర్ అహ్మద్, ప్రవీణ్, తదితరులున్నారు.