Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భీమదేవరపల్లి
నిరాశ్రయులైన బాల బాలికలను ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కె దామోదర్ పి సుధాకర్ అన్నారు. మండలంలోని ముల్కనూర్‌లో ఇటీవల కరోనాతో మృతిచెందిన పల్లపు రవీందర్ కుటుంబాన్ని అనారోగ్యంతో మృతిచెందిన దేశెట్టి స్వరూప రాజు పిల్లలను రుద్రాక్ష లక్ష్మీ సమ్మయ్య కుటుంబాలను శుక్రవారం ఆయన పరామర్శించి నిత్యవసర సరుకులు అందజేశారు. కరోనా బారిన పడి నిరాశ్రయులైన తల్లిదండ్రుల పిల్లలను, వికలాంగులను వయోవద్ధుల శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పునరావాసం కల్పిస్తున్నామని తెలిపారు. విద్యాపరంగా తోడ్పాటందిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన బాల బాలికల వివరాలు, బాల్యవివాహాలు జరిగితే సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ పథకం సోషల్ వర్కర్ జి సునీత, అవుట్ రీచ్ వర్కర్ పి విజరుకుమార్, చైల్డ్ లైన్ టీం మెంబర్ రవికృష్ణ అంగన్వాడీ టీచర్లు పి రజిత, శోభారాణి పాల్గొన్నారు.