Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హసన్‌పర్తి : గ్రేటర్ 56వ డివిజన్ కేంద్రం హసన్‌పర్తిలో శుక్రవారం కరోనాతో మరో యువకుడు మృతి చెందాడు. హసన్పర్తికి చెందిన 1990-91 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థి కొత్తపల్లి శ్రీనివాస్(45) ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందగా శుక్రవారం ఇదే బ్యాచ్‌కు ఇదే గ్రామానికి చెందిన కనుకుంట్ల వీరకుమార్ (45) కరోనాతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల క్రితం 1990-91 ఎస్ఎస్సీ బ్యాచ్‌కు చెందిన మరో యువకుడు దాసరి శివకుమార్ (45) కరోనాతో ఎంజీఎంలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే వయస్సుకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. కాగా కనుకుంట్ల వీరకుమార్ అంత్యక్రియలు హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించారు. దీంతో హిందూవాహిని జిల్లా అధ్యక్షులు రూపిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగవెల్లి సాగర్, అనితాఠాకూర్, రంజిత్‌లు ముందుకొచ్చి హసన్‌పర్తి స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రూపిరెడ్డి సూర్యప్రకాష్, అనితఠాకూర్ మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వ్యక్తి బంధువులు 8106027736లో సంప్రదిస్తే ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు