Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను బాధిత కుటుంబాలకు శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేకల స్వప్న, మండల అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్ రెడ్డి అందజేశారు. ఏ రాజుకు రూ.60వేలు, నరసింహకు రూ.41వేలు, ఈ రామారావుకు రూ.60వేలు, హరిబాబుకు రూ.54వేలు, చిన్న రాజయ్యకు రూ.60వేలు రవీందర్ రెడ్డికి రూ.13వేలు, కే రంజిత్‌కు రూ.50వేల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తంగెడ నాగష్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, టీఆర్ఎస్ నాయకులు ఎలుతురి స్వామి, గొల్లే మహేందర్, గొడిశాల వినరుకుమార్గౌడ్ పాల్గొన్నారు.