Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-పోచమ్మమైదాన్ / కాశిబుగ్గ
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చేయడం హర్షణీ యమని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా పరిధి 21 వ డివిజన్ ఎల్బి నగర్ పద్మశాలి సంఘ భవనంలో సామల జయప్రకాష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరోనా కట్టడికై లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఫౌండేషన్ వారు ఈ నెల 1 వ తేదీ నుండి ప్రతి రోజు సుమారు 500 మందికి అన్నదానం చేయడం గొప్ప విషయమన్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ మాతదేశం మీద మామకారంతో ఇలాంటి సేవా చేయడం అభినందనీయమని, కరోనా వైరస్ సోకిన క్రమంలో ప్రాణాంతకంగా మారుతున్న వేళా ఆక్సిజన్‌ను అందించాల్సి ఉంటుందని, అలాంటి కాన్సెంట్రేటర్ను ఉచితంగా అందించడానికి ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదాయకర మన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సామల ప్రదీప్, సామల శ్రీధర్, డా. వెనిశెట్టి రాజ్ కుమార్, చెలిమల్ల సాగర్, పద్మశాలి సంఘ సభ్యులు సుంకన పెల్లి శ్రీనివాస్, అకేన వెంకటేశ్వర్లు, సర్గం దశరథం, సుధాకర్, ప్రభాకర్, సారంగపాణి, ప్రమీల, వసంత పాల్గొన్నారు.