Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-పోచమ్మమైదాన్ / కాశిబుగ్గ
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చేయడం హర్షణీ యమని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా పరిధి 21 వ డివిజన్ ఎల్బి నగర్ పద్మశాలి సంఘ భవనంలో సామల జయప్రకాష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరోనా కట్టడికై లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఫౌండేషన్ వారు ఈ నెల 1 వ తేదీ నుండి ప్రతి రోజు సుమారు 500 మందికి అన్నదానం చేయడం గొప్ప విషయమన్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ మాతదేశం మీద మామకారంతో ఇలాంటి సేవా చేయడం అభినందనీయమని, కరోనా వైరస్ సోకిన క్రమంలో ప్రాణాంతకంగా మారుతున్న వేళా ఆక్సిజన్‌ను అందించాల్సి ఉంటుందని, అలాంటి కాన్సెంట్రేటర్ను ఉచితప్రతి పౌరునికి ఉచిత టీకా ఇప్పించాలి
- డీసీసీ అధ్యక్షుడు నాయిని
నవతెలంగాణ-న్యూశాయంపేట
కరోనా మహమ్మారిని అంతమొందించి ప్రజలని కాపా డాలంటే దేశంలో ప్రతిరోజూ కోటి టీకాలువేయాలని ప్రతిపౌరునికి ఉచిత టీకా వేయించే బాధ్యత కేంద్రం ప్రభుత్వం తీసుకోవాలని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కేంద్రం ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు ఏఐసీసీ అదేశాల మేరకు శుక్రవారం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌కు మెమొరాండం అందించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనాతో పోరాడటానికి మోడీ ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందని, టీకా విధానాన్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మరచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఒకే వ్యాక్సిన్ కోసం 'ధరల వ్యత్యాసాలతో స్లాబ్‌లు' రూపొందించి ఉద్దేశపూర్వకంగా అవకతవకలకు పాల్పదుతందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు దేశంలోని 140 కోట్ల జనాభాకు 39 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను మాత్రమే ఆర్డర్లు ఇచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 6.63 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో అతిపెద్ద ప్రమాదంగా మారిందని సీరం ఇన్స్టిట్యూట్ యొక్క కోవిషీల్డ్ సింగిల్ డోస్ మోడీ ప్రభుత్వానికి రూ .150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ .300 మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు రూ .600 ఇచ్చారని భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ సింగిల్ డోస్ మోడీ ప్రభుత్వానికి రూ .150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ .600 మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు రూ .1,200 ఇచ్చారన్నారు. రోజుకు 16 లక్షల మందికి కాకుండా కనీసం ఒక కోటి మందికి టీకాలు వేయాలని కోవిడ్ -19 మహమ్మారితో పోరాడటానికి, వ్యాధిని నివారించడానికి ఇదొక్కటే మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్, కార్పోరేటర్లు తోట వెంకన్న, పోతుల శ్రీమాన్, టిపీసీసీ కార్యదర్శులు కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, డివిజన్ అద్యక్షుడు ఎస్. కుమార్ యాదవ్, కొత్తూరు రాజేష్, జిల్లా ఎన్ఎస్యూఐ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లకొండ సతీష్ పాల్గొన్నారు.ంగా అందించడానికి ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదాయకర మన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సామల ప్రదీప్, సామల శ్రీధర్, డా. వెనిశెట్టి రాజ్ కుమార్, చెలిమల్ల సాగర్, పద్మశాలి సంఘ సభ్యులు సుంకన పెల్లి శ్రీనివాస్, అకేన వెంకటేశ్వర్లు, సర్గం దశరథం, సుధాకర్, ప్రభాకర్, సారంగపాణి, ప్రమీల, వసంత పాల్గొన్నారు.