Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్పీఐ రాష్ట్ర కార్యదర్శి జన్ను సాంబయ్య
నవతెలంగాణ-క్రిస్టియన్ కాలనీ
నగరంలో నివాస స్థలాలు లేని పేదలను గుర్తించి గుంట భూమిని నివాస స్థలంగా ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి జన్ను సాంబయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్లో మధ్దునూరి సరిత అధ్యక్షతన ఆర్పీఐ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జన్ను సాంబయ్య మాట్లాడుతూ జీవనోపాధి కోసం పల్లెల నుండి పట్టణాలకు వలస వచ్చిన పేదలకు నిలువ నీడ లేక, ఇంటి కిరాయిలు కట్ట లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తిగా విఫలమైందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బాధలు తీరుతాయి అని ముందుండి పోరాడిన వారికి నిరాశే ఎదురైందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భూ సాధన నూతన కమిటీ ఎన్నిక....
అధ్యక్షురాలిగా నద్దునూరి సరిత, ఉపాధ్యక్షులుగా పెండ్యాల లక్ష్మి, శీలం విజయ, బింగి అనిత, బలభద్ర మౌనిక, ప్రధాన కార్యదర్శులుగా రాశి రమేష్, కానూరి మమత బలభద్ర సరిత, జిల్లెల్ల మాధవి, సహాయ కార్యదర్శులుగా జన్ను రేణుక, గోరిక స్వప్న, రాసాల సంపత్, వల్లెపు బిక్షపతి ఎన్నుకున్నారు.