Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
పర్యావరణంపైనే ప్రాణికోటి మనుగడ ఆధారపడి ఉందని మహబూబాబాద్ ఏఎస్పీ యోగేష్ గౌతం అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం లోని హైమా గార్డెన్స్‌లో శనివారం మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం మాట్లాడారు. చెట్లు ప్రాణ వాయువు ను అందిస్తాయని తెలిపారు. మొక్కల పెంపకంపైన జీవరాసి మనుగడ ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వికాస్ విద్యాసంస్థల సెక్రెటరీ బిక్కి వెంకటేశ్వర్లు, గండమల మధు, జయప్రకాష్ లోయ, గోట్ల వెంకటేశ్వర్లు, రామకృష్ణ, వీరన్న, శ్రీనివాస్, పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత : టీపీటీఎఫ్
పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ అభివర్ణించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. చెత్తాచెదారం తొలగించారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, పొనుగోటి రామకష్ణ, డాక్టర్ డోలి సాయిచరణ్, శ్రీనివాస్‌రెడ్డి, మేడ వెంకట్, బావ్‌సింగ్, పూజారి వెంకటేశ్వర్లు, గోవర్ధన్, శంకర్, డాక్టర్ కాలేరు సత్యనారాయణ, కుర్ర మహేష్, వీరేందర్, అన్వర్, వెంకన్న, ముండ్రాతి వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.