Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల చట్టాల ప్రతుల దహనం
నవతెలంగాణ-సంగెం
వ్యవసాయం చట్టాలను రద్దు చేస్తూ క్రాంతి దివస్ సందర్బంగా మండలంలోని గవిచర్ల గ్రామంలో కే వ్యతిరేక చట్టాల పత్రాలను దహనం చేశారు. ఏఐకెఎస్సీసీ మండల కన్వీనర్ గోనె రాంచందర్, ఇస్మాయిల్, దామోదర్ యువ రైతు సంఘాల నాయకులు ప్రవీణ్, నరేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: ఎంసీపీఐయూ, తెలంగాణ రైతు సంఘం మరి యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గీసుకొండ మండలం మచ్చపూర్ వద్ద నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేశారు. ఎంసీపీఐయూ వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి గోనె కుమా రస్వామి, తెలంగాణ రైతు సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్య క్షుడు సోమిడి శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు ఓదేల రాజయ్య, కంకణాల మల్లికార్జున్, సింగిరెడ్డి కొమురెల్లి, చిరుల రవీందర్, గూ డా సురేష్ ,సింగిరెడ్డి రవీందర్, సోమిడి సాంబయ్య పాల్గొన్నారు.
నర్సంపేట: కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చింతమల్ల రంగయ్య, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హన్మకొండ శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బుర్రి ఆంజనేయులు, సీఐటీయు జిల్లా కోకన్వీనర్ కందగట్ల వీరేష్, సీపీఐ(ఎం) నాయకులు గడ్డమీది బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి: మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన నల్ల చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. రైతు సంఘం జిల్లా నాయకులు సూరన్న, సీఐటీయూ మండల కార్యదర్శి జిల్లా రమేష్, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోడేటి దయాకర్, నాయకులు వెంకన్న, దర్గయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.