Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గుండు సుధారాణి
- ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం
నవతెలంగాణ-ఖిలా వరంగల్
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా పరిధి 41వ డివిజన్ శంభుని పేట వాటర్ ట్యాంక్ వద్ద ఇంజ నీరింగ్ అధికారులతో నీటి సరఫరా తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సీఎం మిషన్ భగీరథ పథకం కు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటికి నీరు అందించాలన్న ఉద్దేశ్యంతో చేపట్టారన్నారు. శంభుని పేట ఈఎస్ఎల్ఆర్. నుంచి పశ్చిమ ఖిలా వరంగల్ కు చేరే పైపులైన్ అనుసంధానం పనులు లాక్ డౌన్ వల్ల లెబర్ కొరత ఏర్పడడం వల్ల అట్టి పనులు పెండింగ్‌లో ఉన్నాయని పబ్లిక్ హెల్త్ ఈఈ మేయర్‌కు వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల చివరి నాటికి పైపులైన్ అనుసంధానం పూర్తిచేసి ఆ ప్రాంత వాసుల నీటి సరఫరా సక్ర మంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి, పబ్లిక్ హెల్త్ ఈ. ఈ.రాజ్ కుమార్, ఏ.ఈ.లు హబీబ్, వంశీ కష్ణ తదితరులు పాల్గొన్నారు.