Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూఈఈఎంఏ అధ్యక్షుడు సాగర్
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
ప్రభుత్వం జర్నలిస్టులపై కక్షపూరిత చర్యలు మానుకోవాలని వరంగల్ ఈస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు సాగర్ అన్నారు. వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్లో శనివారం వరంగల్ తూర్పు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్ న్యూస్ రిపోర్టర్ రఘు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్‌ల హక్కులను తెలంగాణ ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్ని స్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులపై కక్షపూరిత చర్యలు చేప డుతుందని విధి నిర్వహణలో భాగంగా రఘు వార్తలు సేకరించారని అన్యాక్రామణకు గురైన భూమిని పరిశీలించాల్సింది పోయి తెలంగాణ ప్రభు త్వం రఘు పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందని ,ప్రభుత్వం వెంటనే బేశరత్ గా విడుదల చేయాలని సాగర్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతూ వరంగల్ అర్బన్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఆయుబ్ ఆందోళనలో పాల్గొన్నారు. తూర్పు ఎలక్ట్రానిక్ మీడియా అసోసి యేషన్ నాయకులు వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు అయూబ్, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.