Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడీఏ దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
ఫర్టిలైజర్ షాపులలో నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వరంగల్ ఏడీఏ దామోదర్‌రెడ్డి హెచ్చ రించారు. మండల కేంద్రంలోని పలు సీడ్స్, ఫర్టిలైజర్స్ షాపులలో టాస్క్ఫోర్సు, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ, ఏవో అనురాధ, ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు బృందం కలిసి షాపులలోని ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను పరిశీలించారు. రికార్డులలో నమోదు, స్టాకు వివరాలను తనిఖీ చేశారు. గడవు ముగిసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని షాపు యజమానులకు సూచించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల అమ్మకాలు, నిలువ వివరాలు సరిచూసుకోవాలన్నారు. రైతులు కొనుగోలు చేసిన వాటికి తప్పకుండా రశీదు ఇచ్చి రైతు వివరాలను తీసుకున్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కంపెనీల పేరు తప్పకుండా రికార్డులలో నమోదు చేయాలన్నారు. హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు మండల వ్యవసాయాధికారి అడ్లూరి అనురాధ, ఎస్సై దేశిని విజరుకుమార్, ఏఈవోలు క్రాంతి, భాస్కర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.