Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మండల కేంద్రంలోని సీ.హెచ్.సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రేడర్స్ వ్యాక్సినేషన్ సెంటర్ను శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనం తరం అస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ డీఎంహెచ్ఓ మదుసూధన్, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, ఎంపీపీ అప్పారావు, జెడ్పి టీసి మార్గం బిక్షపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలందర్ రెడ్డి, కౌన్సిలర్లు రాజమణి తదితరులు పాల్గొన్నారు.
కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కేఎన్ఆర్ కన్సట్రక్షన్స్ వారి సహకారంతో ఒక్కో కుటుంబానికి రూ. 20వేల చొప్పున వర్ధన్నపేట మండ లానికి చెందిన 11 బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహా యాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అప్పారావు, జెడ్పిటీసి బిక్షపతి, మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ మంగ తిరుపతిరెడ్డిి, సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.