Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలలోని గురిమల్ల గ్రామంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ కరోనా బాధితులను పరామర్శించి కరోనాపై అవగాహన కల్పించారు. బాధితులకు కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపారు. శ్వాసలో ఇబ్బందులు కలిగితే ఆశవర్కర్ల దగ్గర ఉన్న ఆక్సీమీటర్ ద్వారా పల్స్ చెక్ చేయించుకోవాలని సూచించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ, ఏఎన్ఎంలకు చెప్పారు. కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ హరిసింగ్ నాయక్, ఎంపీపీ చేపూరి మౌనిక, వైస్ ఎంపీపీ తాతా గణేష్, గౌరారం ఎంపీటీసీ వజ్జ భద్రయ్య, గురిమల్ల సర్పంచ్ వజ్జ అనసూర్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గంగుల సత్యనారాయణ, పార్టీ ఉపాధ్యక్షుడు బత్తిని రామ్మూర్తి గౌడ్, ఎంపీడీఓ చలపతిరావు, తహసీల్దార్ నాగ భవానీ, సీఐ తిరుపతి, ఎస్సై జగదీష్, కార్యదర్శి రవి, తదితరులు పాల్గొన్నారు.