Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందేమాతరం వ్యవస్థాపకుడు రవీంద్ర
నవతెలంగాణ-తొర్రూరు
ప్రాణికోటి మనుగడకు ఆధారం అయిన ప్రకృతి సంరక్షణతోనే ప్రపంచ మనుగడ సాధ్యమౌతుందని శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగ వందేమాతరం ఫౌండేషన్ నితిన్ భవన్ లో పది లక్షల విత్తన బంతుల తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా వందేమాతరం ఫౌండర్ రవీంద్ర మాట్లాడారు. 30 రకాల అటవీ జాతుల విత్తనాలను కర్ణాటక, కేరళ, నల్లమల అడవుల నుంచి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ విత్తనాలను సేకరించిందని చెప్పారు. వాటితో మహబూబాబాద్తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు 10 లక్షల విత్తన బంతులని ఈ నెల చివరి నాటికి తయారీ చేసి ఇవ్వాలనే లక్ష్యంతో తయారీకి శ్రీకారం చుట్టనున్నారు. చింత, మర్రి, జువ్వి, విప్ప, ఎర్ర చందనం, శ్రీ చందనం, నల్ల మద్ది, సండ్రా, నారవేప, సీతాఫల , మహాగని, జిట్రేగు వంటి విత్తనాలతో నితిన్ భవన్ లోని విధ్యార్ధులు, వందేమాతరం కార్యకర్తలు విత్తన బంతుల తయారీకి పూనుకున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు దిలీప్, శ్రీరామ్, సంజరు, స్వాతి, మంజుల మరియు విధ్యార్ధులు పాల్గొన్నారు.