Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఆపత్కాలంలో కరోనా బాధితులకు అండగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పోరిక గోవిందనాయక్ కోరారు. మండలంలోని పాపయ్యపల్లె, సండ్రగూడెం, బాలాజీనగర్ గ్రామాల్లో ఆ పార్టీ మండల అధ్యక్షులు మురహరి భిక్షపతి ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలను శనివారం పరామర్శించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి, మండల ఇన్‌ఛార్జి గోవింద్‌నాయక్ మాట్లాడారు. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పిస్తూ లాక్డౌన్ పరిస్థితుల్లో వారం రోజులకు సరిపడా సరుకులు అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 400 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ధారావత్ రాకేష్, ఇస్లావత్ మౌనిక వినోద్, మండల ఉపాధ్యక్షుడు లకావత్ నర్సింహా నాయక్, సమ్మక్క, గ్రామ కమిటీ అధ్యక్షుడు రుద్రబోయిన మల్లేష్, బానోత్ వెంకన్న, మీటూనాయక్, గణేష్‌లాల్, ప్రతాప్, పోరిక శామ్యూల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.