Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతక్క యువసేన మండల అధ్యక్షుడు చెర్ప రవీందర్
నవతెలంగాణ-తాడ్వాయి
క్వింటా వరి ధాన్యానికి రూ.2500లు చొప్పున చెల్లించాలని సీతక్క యువసేన మండల అధ్యక్షుడు చెర్ప రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ఊరట్టం పంచాయతీ పరిధిలోని జంపంగవాయిలో వరి ధాన్యాన్ని రైతులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఛత్తీస్‌ఘడ్‌లోని ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన క్వింటాకు రూ.1870లు మద్దతు ధరకు అదనంగా రూ.630లు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా ఉందన్నారు. కేవలం రూ.1870లు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. రైతులు ఎకరాకు సుమారు రూ.23 వేలు నష్టపోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. కొందరు టీఆర్ఎస్ నాయకులు దళారీ అవతారమెత్తి రాష్ట్రంలోని ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌ఘడ్‌లో అధిక ధరకు అమ్ముతూ అక్రమ ఆర్జనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కింటాకు కనీసం రూ.2500లు చొప్పున మద్దతు ధర చెలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీతక్క యువసేన జిల్లా నాయకులు మడప జోగయ్య, చెర్ప వీరమోహన్‌రావు, బొబ్బిలి పాపయ్య, గజ్జెల రాజశేఖర్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.