Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ బారిన 12 మంది మావోయిస్టు నేతలు
- అప్రమత్తమైన నిఘా వర్గాలు
దండకారణ్యంలో మావోయిస్టులు కోవిడ్ బారిన పడి తీవ్ర అస్వ స్థతకు గురయ్యారని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. సిపిఐ (మావోయిస్టు) పార్టీ అగ్రనేతలు 12 మంది తీవ్ర అస్వస్థతకు గుర య్యారని, వారు చికిత్స పొందడానికి మావోయిస్టు పార్టీ అనుమతించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావో యిస్టు నేతలు వైద్య సేవల నిమిత్తం వచ్చే అవకాశముందని భావించి పోలీసు ఉన్నతాధికారులు నిఘాను తీవ్రతరం చేశారు. జయశంఖర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలతోపాలు వరంగల్ నగరంలోని ప్రముఖ ఆస్పత్రులపై నిఘా విధించినట్లు తెలుస్తుంది. ఛత్తీస్‌గఢ్ బస్తర్ డీఐజీ మావోయిస్టులు కోవిడ్ బారిన పడ్డారని ప్రకటన చేశాక మావోయిస్టు పార్టీ దాన్ని ఖండించింది. ఈ క్రమంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు కోవిడ్‌తో బాధపడుతూ వైద్యసేవల కోసం వస్తున్న మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధూకర్, కోరియర్ను అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు నిఘాను తీవ్రతరం చేశారు.
నవతెలంగాణ-వరంగల్
దండకారణ్యంలో సీపీఐ (మావోయిస్టు) పార్టీ అగ్రనేతలు కోవిడ్ బారిన పడ్డారని, వైద్యసేవల కోసం ఆస్పత్రుల్లో చేరడానికి ఆ పార్టీ వారికి అనుమతినివ్వడం లేదని పోలీసు ఉన్నతాధికారులు తాజాగా ప్రక టించారు. పార్టీ అగ్రనేతలు 12 మంది కోవిడ్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఇటీవల వరంగల్‌లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధూకర్ ఎలియాస్ మోహన్ ఎలియాస్ శోబ్రారు, మావోయిస్టు పార్టీ మైనర్ కోరియర్ను వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు 12 మంది మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కోవిడ్‌తో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ధ్రువీకరించారు. గత నెలలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బస్తర్ డిఐజి మావోయిస్టులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారని ప్రకటించారు. ఈ ప్రకటనను మావోయిస్టు పార్టీ ఒక ప్రకటనతో తీవ్రంగా ఖండించింది. పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి పరిస్థితి వస్తే ప్రజలే తమను రక్షించుకుంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కోవిడ్ బారిన 12 మంది మావోయిస్టు అగ్రనేతలు
గడ్డం మధూకర్ ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది అగ్రనేతల్లో కటకం సుదర్శన్ ఎలియాస్ ఆనంద్, తిప్పరి తిరుపతి ఎలియాస్ దేవోజీ, యాప నారాయణ ఎలియాస్ హరి భూషణ్, బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి ఎలియాస్ ధర్మన్న, కట్టా రాంచందర్‌రెడ్డి ఎలియాస్ వికల్ప్, మూలా దేవేం దర్‌రెడ్డి ఎలియాస్ మాస దడ, కుంకటి వెంకటయ్య ఎలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ ఎలియాస్ రఘు, కోడి మంజుల ఎలియాస్ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత ఎలియాస్ బుర్రా కోవిడ్‌తో అస్వస్థతకు గుర య్యారు. ఈ విషయాన్ని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఇటీవల ధృవీకరించారు. వీరు కోవిడ్ చికిత్స తీసుకోవడానికి మావోయిస్టు పార్టీ అనుమతించడం లేదని కూడా పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు. ఆరోగ్యం క్షీణించినప్పుడు మాత్రమే మెరుగైన చికిత్స పొందేందుకు పార్టీ అనుమతి ఇస్తుందన్నారు. గత పది రోజుల క్రితం బీజాపూర్ సిల్దూర్ గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలతో మావోయిస్టులు నిర్వహించిన నిరసన సమయంలో కోవిడ్ లక్షణాలున్న ప్రజలను మావోయిస్టు నేతలు, సభ్యులు కలవడం ద్వారా వీరికి సైతం కోవిడ్ సంక్రమించిందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.
నిఘా వర్గాల అప్రమత్తం..
కోవిడ్ బారిన పడ్డ మావోయిస్టు పార్టీ నేతలు వైద్య సేవల కోసం సరిహద్దుల్లోని భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వచ్చే అవకాశముందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు నిఘా వర్గాలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే దండకారణ్యం డివిజన్ జోనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధూకర్ ఎలియాస్ మోహన్ కోవిడ్ వైద్య సేవల కోసం వస్తూ పోలీ సులకు చిక్కిని విషయం విదితమే. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ నుండి తెలం గాణ సరిహద్దు జిల్లాలకు అగ్రనేతలు వైద్యం కోసం వచ్చే అవకా శముందని భావిస్తున్న పోలీసులు సరిహద్దు జిల్లాల్లో గట్టి నిఘా విధిం చడంతోపాటు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.