Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్క రించుకొని శనివారం వడ్డేపల్లి లోని గ్రీన్ లెగసి పార్క్లో కమిషనర్ పమేలా సత్పతితో కలసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన వాతావరణం కల్పిం చడానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కషి చేస్తున్నదని తెలిపారు. పర్యావరణ పరి రక్షణను మించిన సంపద లేదనే విషయం ప్రస్తుతం కరోనా సమ యంలో మరోసారి రుజువయ్యిందన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్థున్న దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమన్నారు. ముఖ ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ బడ్జెట్ లో 10 శాతం నిధులు ప్రత్యేకంగా పచ్చదనం పెంచుటకు కేటాయించడం వల్ల పట్టణాలలో పచ్చదనం పెరిగి పర్యావరణాన్ని పెంపొందుటకు దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రా ములు, బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి, సిహెచ్ఓ సునీత, హార్టికల్చర్ అధికారి ప్రెసిల్లా, ఏ.ఈ హరి కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు పాల్గొన్నారు.
ఓసీపీలో పర్యావరణ దినోత్సవం
మల్హర్ రావు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ హెడ్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వ ర్యంలో కాపురం ఓసీపీలో మొక్కలు నాటారు. పరేసన్ డిప్యూటీ చెంద్రమోగిలి, సీపీఆర్ఓ వెంకట్, మైన్ మేనే జర్ కెఎస్ఎన్ మూర్తి, సేఫ్టీ ఆపిసర్ సురేష్ బాబు, జీఎం రవిందర్, డీజీ ఎమ్ రవికుమార్, కిరణ్ రాజు పాల్గొన్నారు.
పర్యావరణ ప్రతిజ్ఞ:
కోల్బెల్ట్: పర్యావరణాన్ని కాపాడడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏరియా సేఫ్టీ ఆఫీసర్ బచ్చ రవీందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్క రించుకొని భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది, అధికారులతో కలిసి రవీందర్ పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. టీబీజీకేఎస్ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొక్కుల తిరుపతి, ఏఐటీయూసీ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఏజీఎం (ఐఈడి)జ్యోతి, పర్సనల్ మేనేజర్ అజ్మీర తుకారం, పాల్గొన్నారు.
హసన్పర్తి : గ్రేటర్ 66వ డివిజన్ కేంద్రం హసన్పర్తిలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ ఇంటి ఆవ రణలో మొక్కను నాటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.
చెన్నారావుపేట: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ ఫుల్ సింగ్ చౌహాన్ మొక్కలు నాటారు. డిప్యూటీ తహసీల్దార్ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వామి, రెవెన్యూ సిబ్బంది ఐలయ్య పాల్గొన్నారు.