Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మూడ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆర బోసిన వరి ధాన్యం పూర్తిగా తడిచిందని తెలి పారు. కొనుగోలు కేంద్రాలలో కాంటాలు ఆలస్యం చేయడం వల్ల అకాల వర్షాలు కురిసి రైతులు నష ్టపోవాల్సిన వస్తుందన్నారు. వెంటనే తడిసిన ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర కేటాయించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులు ఆరుగాలం చమటోడ్చి పండించిన ధాన్యాన్ని తేమ, దుమ్ము ధూళి పేరిట మిల్లర్లు క్వింటాకు ఎనిమిది కిలోల తరుగుతో కోత విధించడం అన్యా యమన్నారు. మార్కెట్ బైలా ప్రకారం క్వింటాకు మూడు కిలోలకు మించి తరుగు తీయవద్దని, కొనుగోలు కేంద్రాల ఏజన్సీలు, మిల్లర్లు కుమ్మకై రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు. కొను గోలు కేంద్రాలను సివిల్ సప్లరు అది óకారులు కనీసం పర్యవేక్షించిన పాపాన పోలేదని విమ ర్శించారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యం బేషరత్గా కొనుగోలు చేస్తూ కాంటాల వద్ద మోసాలను అరికట్టాలన్నారు. లేకపోతే రైతులను ఏకం చేసి ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్, బుర్రి అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.