Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అఖిల భారత రైతు సమన్వయ పోరాట కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో మంద సార్ అమర వీరులకు ఢిల్లీ రైతు పోరాట అమరవీరులకు మండల అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 6 జూన్ 2017లో మధ్యప్రదేశ్ లోని మందసార్ వ్యవసాయ మార్కెట్ లో పంటలకు మద్దతు ధర ఇవ్వాలని ఉద్యమించే రైతులపై పోలీసుల పాశవిక కాల్పుల్లో ఆరుగురు రైతులు అక్కడికక్కడే మరణించారని అన్నారు. యూజీసీ ఢిల్లీ రైతాంగ పోరాటంలో ఇటీవల చనిపోయిన 475మంది రైతులకు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటిం చినట్టు తెలిపారు. పంటలకు మద్దతు ధర చట్టం అయ్యేం తవరకు పోరాడుతూనే ఉంటామని, మహా సంకల్పం ప్రతిజ్ఞ చేస్తూ సంకల్ప దివాస్ని పాటించాలని, పోరాటాలకు సమాయత్తం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, జిల్లా అధ్యక్షులు జగ్గన్న, రైతు సంఘాల నాయకులు మండ రాజన్న, నంబూరి మధు, సైదులు, బిల్లకంటి సూర్యం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.