Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుం బాలను ఆదుకునేందుకు తాము, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ములుగు జిల్లా ఎస్పీ పోతురాజు సాయి చైతన్య అన్నారు. ఆదివారం మండలంలో పేదలకు, గొత్తికోయ కుటుంబాలకు గోస్పెల్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఏఎస్పీ సూచనల మేరకు సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రవీందర్ సిబ్బందితో కలిసి మండల పరిధి ప్రాజెక్టునగర్, దేవునిగుట్ట, భూడిదిగడ్డ, జారుడుబండ, కన్నయ్య, పండిరిదోన, టేకులకుంట, మచ్చపూర్ మొత్తం 8 గొత్తికోయ గుంపులకు, నిరుపేదలకు 350 నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన సీఐ, ఎస్సై, ప్రొబేషన్ ఎస్సై, సిబ్బందిని అభినందించారు. జీటీఎస్ఎస్ సంస్థ చైౖర్మెన్ మారినేని జాకబ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీటీఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ నిర్మాహకులు రొకటి వెంకటరామారావు, సిబ్బంది, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.
పేదలను ఆదుకోవాలి : సీఐ, ఎస్సై
కరోనా ఆపత్కాలంలో పేదలను ఆదుకోవాలని సీఐ శ్రీనివాసు లు, ఎస్సై రవీందర్ అన్నారు. ఆదివారం మండలంలోని రామ్‌నగర్ లక్ష్మీపురం పంచాయతీల్లో పలువురు పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు సర్పంచులు భూక్యా మోహన్ రాథోడ్ లావుడియా స్వాతి బాగానాయక్ ఆధ్వర్యంలో పంపిణీ చేసి వారు మాట్లాడారు. కష్టాల్లో ఉన్న ప్రజలను సకాలంలో ఆదుకున్న వారే నిజమైన పాలకులన్నారు. అనంతరం సర్పంచులు సీఐ శ్రీనివాసులు, ఎస్సై రవీందర్‌ను సన్మానించారు.