Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని చిన్నముప్పారం గ్రామంలో పెట్రోల్ బంక్ ( శ్రీ సాయిరాం ఫిల్లింగ్ స్టేషన్)ను మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆదివారం బంకు నిర్వాహకులు దావత్ కవిత, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వినియోగదారులు కరోనా నిబంధనలు పాటిస్తూ పెట్రోల్ కొనుగోలు చేయాలన్నారు. బంకు నిర్వాహకులు నాణ్యమైన పెట్రోల్‌ను అందించాలన్నారు. అనవసరంగా రోడ్లపై తిరగొద్దని, ఇంట్లోనే ఉండి కరోనా కట్టడికి సమకరించా లన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామగిరి పీఏసీఎస్ చైర్మెన్, వైస్ చైర్మెన్ గుండా వెంకన్న, భోజ నాయక్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పరిపాటి వెంకట్‌రెడ్డి, పెద్దతండ సర్పంచ్ రాజు, పరమేష్, యాకుబ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.