Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ శిరీష
నవతెలంగాణ-భూపాలపల్లి
మంచి పౌష్టికాహారంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ కె.శిరీష అన్నారు. ఆదివారం భూపాలపల్లి మండలంలోని పెరకపల్లి, నేరేడుపల్లి, గొర్లవీడు, మల్హర్ మండలంలోని అన్సాన్పల్లి గ్రామాల్లో కోవిడ్ బాధిత చిన్నారుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ సీడీపీఓ సీహెచ్ అవంతితో కలిసి బాల సహాయ పౌష్టికాహార కిట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి వచ్చిన సమాచారం మేరకు ఆయా గ్రామాల్లో కరోనా బారిన పడిన పిల్లల కుటుంబాలకు పౌష్టికాహార కిట్లను అందించామన్నారు. అంతేకాకుండా కరోనా బారిన పడిన పిల్లల, కరోనా బారిన పడిన తల్లి దండ్రుల పిల్లల రక్షణ, సంరక్షణ నిమిత్తం జిల్లాలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, దీనిని కోవిడ్ భాదితులు సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇంకా ఎవరైనా కోవిడ్‌తో బాధపడుతున్న పిల్లలు గానీ లేదా కోవిడ్‌తో బాధపడుతున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు గానీ ఎవరైనా ఉంటే 040-23733665 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు సమాచారం అందిస్తే వెంటనే వారిని రక్షించే దిశగా తగు చర్యలు తీసుకుం టామన్నారు. బాలల సంరక్షణ అధికారి రాజకొమురయ్య, ఎల్‌సీపీఓ మోహి నోద్దీ న్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ అరుణ, సోషల్ వర్కర్లు లింగరావు, శైలజ, అంగన్వాడీ టీచర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.