Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమశ్రీ
నవతెలంగాణ-హసన్‌పర్తి
సూపర్ స్ప్రెడర్స్ కరోనా టీకా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్సీడీ ప్రోగ్రాం ఆపీసర్ డాక్టర్ ఉమశ్రీ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి రామారం జీఎమ్మార్ గార్డెన్స్‌లో బల్దియా ఆధ్వర్యంలో హసన్‌పర్తి యూపీహెచ్సీ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహిస్తున్న కరోనా టీకా శిభిరాన్ని ఆమె ఆదివారం పరిశీలించారు. శిభిరంలో ఏర్పాటు చేసిన 10 కౌంటర్లలో ఆదివారం సెలవు దినం కావడంతో రద్దీ మరింత పెరిగింది. దీంతో ఆవరణలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. వైద్య సిబ్బంది, బల్దియా అధికారులు రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలకు, వైద్య సిబ్బందికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమశ్రీ మాట్లాడుతూ సూపర్ స్ప్రెడర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీకా శిభిరంలో కేవలం షాపుయజమానులు, స్ట్రీట్ వెండర్స్, గ్యాస్, పెట్రోల్ బంక్ వివిద షాపులలో పనిచేసే వారు మాత్రమే వినియోగించుకోవాలని ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమశ్రీ అన్నారు. పాజిటీవ్ కేసుల నియ ంత్రణకు వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్బంగా యూపీహెచ్సీ హసన్‌పర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ మాట్లాడుతూ శనివారం రామారం జీఎమ్మార్ గార్డెన్స్‌లో బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా టీకా శిభిరంలో 96 వాయిల్స్ ద్వారా 960 మందికి కరోనా టీకాలు వేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ రమణశ్రీ, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీస్ సూపరింటెండెంట్ రమేష్, వైద్య సిబ్బంది ఉదయవరులు, సుమతి, సుమలత, ప్రశాంతి, శోభ, మం జుల, సమత, శ్రీలత, సలీమా, కవిత, సువర్ణమేరి, బల్దియా అది óకారులు భీమయ్య, సిబ్బంది భిక్షపతి, సుజాత, సురేష్, నాగరాజు పాల్గొన్నారు. -