Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మండల కేంద్రంలోని ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద ఆదివారం వరంగల్, హనంకొండ, కాజిపేట్ ట్రై సిటీకి చెందిన సైకిల్ రైడర్స్ ఉల్లాసంగా ఉత్సాహంగా రైడింగ్ చేశారు. రిజర్వాయర్ వద్ద గల ఏ చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పంపింగ్ రిజర్వాయర్ నీటి కాలువలు ,మిషన్ భగీరథ పథకం కింద నిర్మించిన రక్షిత మంచినీటి ఎత్తయిన ట్యాంకులు పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే మరియు నీటిని శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్స్ ప్లాంట్లు రిజర్వాయర్‌కు ముందు పాత చెరువు దిగువన నిర్మించిన గ్రావిటీ నల్ల కట్ట నిర్మాణం సాగునీటి సరఫరా పెద్ద తూము ఆనవాళ్ల ను రిజర్వాయర్ పైన నిర్మించిన ఆధ్యాత్మిక పరమైన దేవాలయాలు పెద్దమ్మ గుడి, దండి ఈశ్వరుని శివాలయం, బతుకమ్మ నిమజ్జన స్థలాలు, సహాయ మాత పుణ్యక్షేత్రం ,ఎత్తయిన ఏసుక్రీస్తు సిలువ స్వరూపం, రిజర్వాయర్ చుట్టూ ఆనుకుని ఉన్న సహజసిద్ధమైన కొండలు గుట్టలు పొడవయిన ఇనుప రాతి గట్లు, రిజర్వాయర్ సౌత్ నార్త్ కెనాల్ కాలువలు రైతులకు ఆయకట్టకు సాగునీరు అందించే నక్కలతో నిర్మాణం, రిజర్వాయర్ కట్ట కింద వ్యవసాయ పచ్చిక బయలు తిలకించారు. ఈ సందర్భంగా సందర్శకులు పర్యాటక కేంద్రం ఏర్పాటులో భాగంగా ఉయ్యాల వంతెన సందర్శకులు రిజర్వాయర్‌లో మధ్యలో ఉన్న గుట్ట చుట్టూ పర్యటించేందుకు బోట్లను ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని అభిలాషించారు.