Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిక్కుతోచని స్థితిలో భార్య, ముగ్గురు పిల్లలు
- భాదిత కుటుంబం గురించి ట్వీట్ చేసిన సామాజికవేత్త ఫసి
- స్పందించిన సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్
నవతెలంగాణ-ఖిలా వరంగల్
గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్‌కు చెందిన షేక్ ఇక్బాల్‌కు భార్య ముగ్గురు పిల్లలున్నారు. ఆయన ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించే వాడు. 20రోజుల క్రితం కరోనాతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం సంపాదించే పెద్దదిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. బాధితుడిని భార్య, ముగ్గురు పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఇది గమనించిన సామాజికవేత్త ఫసి ఆదీబ్ బాధిత కుటంబాన్ని ఆదుకోవాలని సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ట్వీట్ చేశాడు. సదరు సందేశాన్ని చూసిన స్మితా సబర్వాల్ తగిన సాయం చేయాలని మహిళా, శిశు సంక్షేమ అధికారులకు, వరంగల్ అర్బన్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. దీంతో జిల్లా బాలల సంక్షేమ సమితి, బాలల సంరక్షణ అధికారులు ఎ. అనిల్ చందర్, కె.వసుధ, పి.సంతోష్ కుమార్, జి.మహేందర్ రెడ్డి లు బాధిత కుటుంబాన్ని వారి స్వగహంలో కలిశారు. ఇక్బాల్ భార్య రుబినాతో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలుసుకుని ప్రభుత్వం తరపున అండగా నిలబడతామని బాధపడవద్దని తెలిపారు. పిల్లలకు విద్య, వసతి విష యంలో తగిన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. వారికీ నిత్యావసర సరుకులను అందజేశారు. ఓఎస్డీ డా. శాంతా తౌటం బాధిత కుటుంబానికి తన వంతుగా నిత్యావసర సరకులను పంపించారు. ట్విట్టర్ వేదికగా వేగంగా స్పందిస్తున్న అధికారులను నెటిజన్లు ప్రశంసిస్తూన్నారు.