Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
నవతెలంగాణ-భూపాలపల్లి
పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలను ఆర్థికంగా దివాలా తీస్తున్న బీజేపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద క్లాక్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014వ సంవత్సరం నుంచి సుమారు 20సార్లు పెట్రోల్, డీజల్,గ్యాస్ రేట్లు పెంచిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్,డీజల్ రేట్ల విషయంలో అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించి గద్దెనెక్కిన తర్వాత ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల సామన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ధరలు తగ్గించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మోటపలుకుల రమేష్, కుడుదుల వెంకటేష్, క్యాతరాజు సతీష్, కోటిలింగం, అమతయ్య, డప్పు రమేష్, శ్రీనివాస్ ,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.