Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండల పరిధిలోని గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలకు ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంట జ్యోతి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మండలంలోని నేరేడుపల్లి గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ బొమ్మన సుజాత రమేష్ దంపతుల కూతురు రవళి అన్వేష్ వివాహ వేడుకలకు, సూర్య నాయక్ తండకు చెందిన మాలోతు రాద రూప్ సింగ్ ల కూతురు మాధవి వివాహం రాజేష్‌తో జరిగింది. ఈ వివాహ వేడుకలకు గండ్ర దంపతులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి పట్టువస్త్రాలు బహుకరించారు. అనంతరం వసంతపూర్ గ్రామానికి చెందిన నాయకులు భుజంగరావు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకొని ఇంటికి రాగా ఆదివారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సందర్శించి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాజయ్య ఆశీర్శచనాలు
వేలేరు : మండలంలోని పీచర గ్రామ సర్పంచ్ మేక రవీందర్ కూతురు ప్రణీత వివాహ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టీ.రాజయ్య హాజరై నూతన దంపతులు ప్రణీత-శ్రీధర్‌లను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చాడ సరిత విజేందర్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కీర్తి వెంకటేశ్వర్లు, కో ఆప్షన్ సభ్యులు ఎండీ జానీ, ఎంపీటీసీ జలతారు సంపత్, సర్పంచులు గూడ కవితా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.