Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవ్పూర్
కాటారం మండలంలోని కోవిడ్ బాధితులకు సంజీవని సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేసి అండగా నిలిచారు. తిప్పన బోయిన సజన్ జ్ఞాపకార్థం కాళేశ్వరం మాజీ సర్పంచ్ మెంగాని మాధవి -అశోక్ దంపతుల సహకారంతో కాటారం గ్రామపంచాయతీ పరిధిలొని జక్కు నరసింహులు కాలనీ కంటైన్మేంట్ జోన్ లో నాలుగు, మద్దులపలిల్లో ఇద్దరికి కరోనా రోగుల కుటుంబ సభ్యులకు సంజీవని సేవా సమితి ఆధ్వ ర్యంలో నిత్యావసర సరుకులు అందజేసినట్లు కాటారం ట్రిపుల్ యస్ అధ్య క్షులు కొట్టె సతీష్ పేర్కోన్నారు. కాటారం కొమురం భీం కూరగాయల వర్తక సంఘం వారు సంజీవని సభ్యులకు కూరగాయలు సమకుర్చారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఆర్గనైజర్ శ్రీనివాస్ రావ్, నరేష్,సుమన్, సందీప్, పూర్ణచందర్, సాయికిరణ్, హైమద్, సంజు, దీపక్, అభి, రాజేష్ తదితరులున్నారు.
మల్హర్ రావు: మండలంలోని రుద్రారం, పాత రుద్రారంలో కొవిడ్ బాధితులకు సంజీవని సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. తిప్పనబోయిన సజన్ జ్ఞాపకార్థం కాళేశ్వరం మాజి సర్పంచ్ మెంగాని మాధవి అశోక్ సహకారంతో రుద్రారంలో నాలుగు ,పాత రుద్రారంలో 14 మంది కోవిడ్ నిరుపేద కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కలు పంపిణీ చేసినట్లు కాటారం ట్రిపుల్ యస్ అధ్యక్షులు కొట్టె సతీష్ తెలిపారు. హెల్త్ ఆర్గనైజర్ శ్రీనివాస్ రావ్, నరేష్, సుమన్, సందీప్, కుమార్, శేఖర్ నాని, పూర్ణచందర్, సాయికిరణ్,చింటు, హైమద్, సంజు, దీపక్, అభి తదితరులు పాల్గొన్నారు.