Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని గురుకుల పాఠశాలలో కరోనా సోకిన వారికి ఏర్పరిచిన ఐసోలేషన్ సెంటర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మే 18న ప్రారంభించారు. ఐసొలేషన్ సెంటర్కి మూడు నాలుగు రోజుల నుంచి భోజనం తెచ్చేవారు తప్ప ఎవరూ రావడంలేదని, తమని పట్టించుకోవడం లేదని, మూడు రోజుల క్రితం డాక్టర్ వచ్చారని తమకు ధైర్యం చెప్పి వైద్యం చేయాల్సిన డాక్టర్ కరోన బాధితులను తన వద్దకు రావద్దని అనడం గమనార్హం. తమ ఆరోగ్యాన్ని ఎప్ప టికప్పుడు పరీక్షించడానికి ఒక ఏఎన్ఎం లేదా ఆశాని, పోలీస్ సిబ్బందిని ఏమి చేయడంలో అధికారులు విఫల మయ్యారని, ఎక్కడి చెత్త అక్కడే ఉందని,నీటి వసతులు కరువయ్యాయని అందుకు తగు సిబ్బందిని ఏర్పరచాలని బాధితులు తెలిపారు. ఇది ఇలాగే ఉంటే ఐసొలేషన్ సెంటర్లో చేరడానికి కరోన బాధితులు ఆసక్తి చూపడం లేదని బాధితులు తెలిపారు. ఐసోలేషన్ సెంటర్ను పేరుకే ఏర్పరచడం కాకుండా తగు వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని కరోని బాధితులు వాపోతున్నారు.