Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈటల రాజీనామా ప్రకటనతో గంగుల ఇంట్లో మంత్రులు ఎమ్మెల్యేల సమావేశం
- వరంగల్ ఎమ్మెల్యేల హాజరు
- ఈటెల బలాబలాలపై చర్చ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించడానికి ఇప్పటి నుంచే అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రకటించింది. శనివారం రాత్రి హైద్రాబాద్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమ లాకర్ ఇంట్లో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్రావుతోపాటు వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మె ల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌లు హాజరు కావడం గమనార్హం. ఇప్పటికే 'చల్లా' కమలాపూర్ మండలానికి ఇన్ఛార్జిగా వ్యవ హరిస్తుండగా, పెద్ది, అరూరికి కూడా త్వరలో బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.
నవతెలంగాణ-వరంగల్
హుజురాబాద్ నియోజకవర్గంలో 'ఈటల' బలాబలాలు, బీజేపీ బలాబలాలను ఈ సమావేశంలో అంచనా వేసినట్లు సమాచారం. పార్టీ కేడర్ చేజారకుండా ఇప్పటికే మున్సిపాలిటీలు, మండలాలవారీగా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇన్‌ఛార్జిలను నియమించిన విషయం విదితమే. ఇన్ఛార్జిలతో ఆయా మున్సిపాల్టీలు, మండలాల్లో పరిస్థితిని ఆరాతీశారు. జెడ్పీటిసిలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మెన్లు, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మెన్లు ఇప్పటికే టిఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికీ పార్టీకి దూరంగా వున్న వారిని బుజ్జగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమా చారం. 'ఈటల' వెంట వున్న వారిని గుర్తించి పార్టీలో కొనసాగేలా చేయాలని, దీనికి ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు, 'ఈటల'పై సానుభూతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, ప్రస్తుత ఇన్‌ఛార్జిలు ఇచ్చే సమాచారం ఆధారంగా రాష్ట్రస్థాయి నేతలకు ఇన్ఛార్జిలుగా బాధ్యతలు అప్పగించాలన్న సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది.
వరంగల్ ఎమ్మెల్యేల హాజరు..
ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేష్‌లు ఈ సమావేశానికి హాజరుకావడం గమ నార్హం. ఇప్పటికే ఈటల సొంత మండలం కమలాపూర్ ఇన్ఛార్జిగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనసాగుతున్నారు. గత 15 రోజులుగా చల్లా మండలంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు 'ఈటల' వెంట వెళ్లకుండా కట్టడి చేసి టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటనలు చేయించారు. తాజాగా ఎమ్మెల్యేలు అరూరి రమేష్, పెద్ది సుద ర్శన్రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొనడంతో వారిద్దరికి కూడా నియోజకవర్గంలో పలు మండలాలకు బాధ్యతలు ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కమ లాపూర్ మండలం భౌగోళికంగా అటు పరకాల, ఇటు వర్ధన్నపేట నియోజకవర్గాలకు సరిహద్దుగా వుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆ మండలానికి చల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమే ష్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలకు ఏ మండలాల బాధ్యతలు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈటల సొంత మండలం కమలాపూర్నే మూడు భాగాలుగా చేసి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికల వ్యూహరచనలో కీలకంగా వ్యవహరించే అవకాశముంది.