Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ససేమిరా అంటున్న రైతులు కొనుగోలు చేసేది లేదంటున్న అధికారులు
- రోడ్డెక్కిన రైతులు
నవతెలంగాణ-మహబూబాబాద్
కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం కొను గోలు చేయకుండా మిగిలిపోయిన ధాన్యాన్ని రైతులు తక్షణం తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . దీంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ఆందోళన కు సిద్ధమవుతున్నారు. స్వయంగా రైతులే బస్తాలు నింపి వాహనాల్లో లోడింగ్ చేసి తమ ధాన్యాన్ని రైతు వేదికలకు పాఠశాలలకు తరలించాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో మా వల్ల కాదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాల్లో ఈ ఏడాది 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అందులో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించారు. ఇంకా 2 లక్షల 71 వేల క్వింటాళ్ల ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి. వాటిని తరలించడానికి మహబూబాబాద్ జిల్లాలో రైస్ మిల్లులో స్థలం లేదు. వాటిని వరంగల్ అర్బన్ రూరల్ పెద్దపెల్లి జిల్లాకు తరలిస్తున్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలలో సుమారు 20 వేల మంది రైతు లకు చెందిన రెండు లక్షల 41 వేల క్వింటాళ్ల ధాన్యం రాశులున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బస్తాలు నింపడానికి రవాణా చేయడానికి నిల్వ చేయడానికి పరిస్థి తులు అనుకూలంగా లేవని రైతులే స్వయంగా దాన్ని తొలగించాలని రెవెన్యూ సహకార శాఖ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు . దీంతో సహకార శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రైతులతో చర్చలు జరిపారు. తక్షణం తొలగిం చాలని లేదంటే తడిసి ముద్ద అయ్యే అవకాశం ఉందని ఆద ేశించారు. అయితే రైతులు మాత్రం ధాన్యం తొలగిం చడానికి తమ వల్ల కాదు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థి తుల్లో బస్తాలు నింపడానికి హమాలీ చార్జీలు వాహనాల లోడింగ్ ఛార్జీలు వాహనాల రవాణా ఖర్చులు పాఠశాలలో హమాలి ఆన్లోడింగ్ చార్జీలు రైతుల భరించవలసి ఉంటుంది. అంతేగాక పాఠశాలలో నిల్వచేసిన ధాన్యానికి రక్షణ ఎవరు కల్పిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొనుగోలు కేంద్రాలలో దాన్యం తొలగించేది లేదని రైతులు తేల్చిచెప్పారు. అయితే రైతులు ధాన్యాన్ని పాఠశాలలకు తరలించగా ఉంటే కొనుగోలు చేయవద్దని అధికారులు బెదిరిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు . జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం తక్షణమే మొలకెత్తిన మిగిలిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జంగిలి కొండ రహదారిలో ధర్నా మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కేంద్రాల్లో ధాన్యం తొలగించాలని అధికారులు ఆదేశించడంతో ఆగ్రహి ంచిన రైతులు ఆదివారం మహబూబాబాద్ మండలం జంగిలి గుండా క్రాస్ రోడ్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు రోడ్డెక్కి ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటలపాటు ఆందోళన కొనసాగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులతో చర్చలు జరిపారు అధికారంతో మాట్లాడించి ధర్నా విరమింపజేశారు